*అమ్మఒడి*
అమ్మఒడి పథకానికి అర్హులైన విద్యార్థులను ఎంపిక చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ పథకం కింద ఏటా 1-12 తరగతుల విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.15 వేలు జమ చేస్తున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరానికి లబ్ధిదారులకు జూన్‌లో నగదు జమ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
నవంబరు 1 నుంచి ఏప్రిల్ ఆఖరు వరకు 75 శాతం హాజరు తప్పనిసరి.
●●● బియ్యం కార్డు కొత్తది కావాలి.
●●● కరెంటు వాడకం 300 యూనిట్లు కన్నా తక్కువ ఉండాలి.
●●● విద్యార్థి, తల్లి ఒకే హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో ఉండాలి.
●●● విద్యార్థి ఈకేవైసీ అప్‌డేట్ చేయాలి.
●●● సదరు వాలంటీరు వద్ద విద్యార్థి, తల్లి పేరు, వయసు సరిచూడాలి.
●●● బ్యాంకు ఖాతా.. ఆధార్‌కు లింక్ అయిందో లేదో చూడాలి.
●●● ఆధార్ నంబరుతో వాడే చరవాణి లింకై ఉండాలి.
●●● బ్యాంకు ఖాతా మనుగడలో ఉంచాలి.
●●● ఒక వ్యక్తికి రెండు కన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలుంటే ఎన్‌పీసీఐ చేయించాలి.
విద్యార్థి వివరాలన్నీ కూడా సీఎస్సీ వెబ్‌సైట్లో చైల్డ్ ఇన్ఫోలో డేటాతో సరిపోవాలి. పాఠశాల దస్త్రాల్లో హెచ్‌ఎం లాగిన్‌లో ఉన్న తల్లి ఖాతా, చరవాణి సంఖ్య ఒకటైనప్పుడు వారికి ఓటీపీ వస్తుంది. దాన్ని హెచ్‌ఎంలు వారి లాగిన్‌లో నమోదు చేస్తారు. అప్పుడే వారి ఖాతాకు అమ్మఒడి నగదు జమవుతుంది.
0 comments:
Post a Comment