చిన్ని శిశువు, chinni sisuvu telugu lesson, 7th class telugu 3rd lesson, AP STATE new syllabus 2021

చిన్నిశిశువు
7వ తరగతి తెలుగు
3వ పాఠం
రచన: తాళ్ళపాక అన్నమాచార్యులు





Chinni sisuvu lyrics
చిన్ని శిశువు

||ప||చిన్ని శిశువూ చిన్ని శిశువూ
ఎన్నడుం జూడమమ్మ యిటువంటి శిశువూ ||

||చ||తోయంపు గురులతోడ దూగేటి శిరసు, చింత
కాయల వంటి జడల గముల తోడ
మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాలతోడ
పాయక యశోదవెంట పాటాడు శిశువూ ||చిన్ని||

||చ||ముద్దుల వ్రేళ్ళతోడ మొరవంక యుంగరాల
నిద్దపుం జేతుల పైడి బొద్దుల తోడ
అద్దపుం జెక్కులతోడ అప్ప లప్ప లని నంత
గద్దించి యశోదమేను కౌగిలించు శిశువూ ||చిన్ని||

||చ||బలు పైన పొట్టమీది పాలచారలతోడ
నులివేడి వెన్న దిన్న నోరి తోడ
చెలగి నేడిదె వచ్చి శ్రీవేంకటాద్రిపై
నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువూ ||చిన్ని||


Watch the video:

7th class english poems ,The town child poem

7th class english poems ,The town child poem