ENDA 5TH CLASS TELUGU RHYMES ఎండ 5వ తరగతి తెలుగు అభినయ గేయం
ఈ గేయం 5వ తరగతి తెలుగు TEXTBOOK లో ని ,చదువు ఆనందించు సామర్ధ్యం లో భాగం గా ఇవ్వబడినది. ఈ గేయం లో ఎండ గురించి వర్ణించబడినది.
ఎండ గేయం
చదువు ఆనందించు
పొద్దున పొద్దున వచ్చే ఎండ
శిఖరాలను మెరిపించే ఎండ
ఇంటికప్పుపై పరిచిన ఎండ
నేలను అంతా నిండిన ఎండ
చెట్లూ, చేమలు, మైదానాల్లో
పొలాలు,ఇసుకా, పంటచేలపై
కొమ్మ కొమ్మపై ఆగుతు తూగుతు
అలసి సొలసిన మత్తులో ఎండ!
చలిలోనూ నులివెచ్చని ఎండ
ఎండకాలమున మండే ఎండ
ఒంటిని మార్చే కాల్చే ఎండ
మబ్బుల మాటున సిగ్గరి ఎండ
పువ్వు పువ్వులో - మొగ్గ మొగ్గలో
మెల్లమెల్లగా వీధి వీధిలో కిటికీపై అది ఎప్పుడు వాలెనో
ఇంటిలో దూరెను తుంటరి ఎండ
నడకలు మాని కిటికీ తెరిచిన
ఏమీ చెప్పక - తిరిగిన, ఊగిన
గాలిలోని ప్రతి ఔషధ కణమున
తనకు తానుగా ఒదిగిన ఎండ!
సూర్యుడు రాగా - వచ్చెను ఎండ
దినమంతా తన గోడుతో ఎండ
చీకటిపడగా ఎటు నిద్రింతని
అలసి సొలసి అటుపోయిన ఎండ!